కర్నూలులో ఇవాళ పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోసారి వైసీపీ వస్తే మరింత అంధకారం తప్పదని.. శాంతి భద్రతలు కాపాడాలని అడుగుతాం…అది చిన్న సమస్య అంటారని పేర్కొన్నారు. తల్లి పెంపకం బాగలేకుంటే ఇలాంటి సంఘటనలు వుంటాయంటారు.. ఏపీ భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కావాలని స్పష్టం చేశారు.
అందులో ఎవరు కలసి వస్తారో చూడాలని.. ఇందిరా హయాంలో వైసీపీ ని ఓడించాలంటే వ్యతిరేక ఓటు చీలరాదన్నారు. ఎన్నికలకు సమయం ఉంది.. జనసేన పొత్తు బీజేపీ తోనే ఉంది….ఈ రోజు వరకు కూడా అని తెలిపారు. మోదీ అంటే గౌరవం…బీజేపీ అగ్రనాయకులకు రాష్ట్రం పరిస్థితి గురించి , భవిష్యత్తు చెప్తానని వెల్లడించారు.
ఎన్నికల పొత్తులపై చంద్రబాబు వచ్చి అడుగుతే.. అప్పుడు ఆలోచిస్తామని ట్విస్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉందని.. అప్పటి వరకు ఆగాలని తెలిపారు పవన్. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా వైసీపీ ప్రభుత్వం సరిగ్గా పరిపాలన చేయడం లేదు.. తాము ఏం చేసినా తిరుగు ఉండదని దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు.. కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకుని ఉంటే జనసేన రైతు భరోసా యాత్ర చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు పవన్ కళ్యాణ్.