ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది….ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన సరే ఒక ఏడాది పైనే సమయం ఉంటుంది..అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…అప్పుడే ఏపీలో ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తూనే ఊన్నాయి…నెక్స్ట్ మళ్ళీ జగన్ గెలుస్తారా? లేక చంద్రబాబు అధికారంలోకి వస్తారా? లేదా పవన్ కల్యాణ్ వైపు జనం చూస్తారా అనే అంశాలపై చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఏడాది నుంచి టీడీపీ-జనసేన పొత్తు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే వైసీపీకి చెక్ పెట్టడం సులువు అని, లేదంటే ఓట్లు చీలిపోయి మళ్ళీ వైసీపీకి లాభం జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వస్తున్నాయి.
సరే విశ్లేషణలు పక్కన పెడితే చంద్రబాబు-పవన్ కలిస్తే జగన్ కు ఇబ్బందే అని చెప్పొచ్చు..అలాగే వారు విడిగా ఉంటే జగన్ కు లాభమే…అందుకే వైసీపీ నేతలు పొత్తుని చెడగొట్టడమే లక్ష్యంగా కామెంట్లు చెస్తున్నట్లు కనిపిస్తున్నారు…మళ్ళీ బాబుని సీఎం చేయడానికే పవన్ పనిచేస్తున్నారని అంటున్నారు. అంటే పవన్ ని పరోక్షంగా రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తున్నారు. మరి వైసీపీ నేతల మాటల వలనో…లేక పవన్ నిజంగానే అనుకున్నారో తెలియదు గాని…ఇప్పటివరకు త్యాగం చేశామని, ఇకపై త్యాగం చేయమని చెప్పేశారు.
అంటే తనని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలనేది పవన్ కోరిక అనేది అర్ధమవుతుంది. ఇక పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించే విషయంలో బలం లేని బీజేపీనే వెనుకడుగు వేస్తుంది..ఇంకా అలాంటప్పుడు టీడీపీ ప్రకటించడం కష్టం. తాము సింగిల్ గానే గెలుస్తామని టీడీపీ అంటుంది…అసలు పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడమని, పవన్ వైసీపీ ట్రాప్ లో పడుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.
వాస్తవానికి చూస్తే బీజేపీ నేతలు చెప్పేది కరెక్ట్ గానే ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు..వైసీపీ నేతల మాటలకు పవన్ స్పందించాల్సిన అవసరం లేదు…అసలు ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడుకుండా, జనసేన బలోపేతంపై దృష్టి పెడితే బెటర్ అని, ఎన్నికల సమయంలో పార్టీల బలబలాలని చూసుకుని పొత్తు గురించి మాట్లాడితే బెటర్ అని చెబుతున్నారు. మొత్తానికైతే టీడీపీ-జనసేన పొత్తు లేకుండా చేయాలని వైసీపీ గట్టిగానే కష్టపడుతున్నట్లు ఉంది.