పేదోడి కలల సౌధం ఖరీదు.. రూ.25 వేలా రేవంత్ రెడ్డి : కేటీఆర్

-

మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న తరుణంలో ప్రభుత్వం నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసేవారికి డబుల్ బెడ్‌రూమ్‌తో పాటు రూ.25 వేలు నగదు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. తాజాగా దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్‌’వేదికగా గురువారం ఆసక్తికర పోస్టు పెట్టారు.

ఆగుతున్న గుండెలు – విడిపోతున్న కుటుంబాలు, అయినా తగ్గని సర్కార్ దాహం, కలల సౌధం ఖరీదు అక్షరాల రూ.25వేలు అంటూ ట్వీట్ చేశారు. ‘కష్టపడి పస్తులుండి పైసా పైసా కూడేసి – బ్యాంకు నుంచి అప్పు తెచ్చి కట్టిన గూడును కూల్చుతారని భయంతో పోతున్న ప్రాణాలు.16 కాదు 18 మంది అయినా సరే, ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలను రోడ్డుకు ఈడ్చి కుటుంబాల్లో చిచ్చులు పెట్టిన మూర్కుడు రేవంత్.ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్ రూమ్‌తో పాటు రూ. 25వేల పారితోషకం అంటూ అధికారుల వెకిలి ఆఫర్లు.కోటి ఆశలతో లక్షలు-కోట్లు వెచ్చించి కట్టుకున్న ఇండ్లకు 25వేలా? ఓ సన్నాసి, అదే మీ అన్న ఇంటికి, మీ మంత్రుల ఇంటికి రూ.25 వేలు కాదు రూ. 50 వేలు ఇస్తే కూల్చమంటారా? అడుగు ఒకసారి. ఇండ్లు పోతున్నాయి అనే భయంతో ఒక బుచ్చమ్మ, ఒక కుమారన్న ప్రాణాలు పోయాయి. నీ దాన దాహానికి, నీ స్కాములకు ఇంకా ఎన్ని ప్రాణాలు బలితీసుకుంటావో చెప్పు’ అని సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version