తెలంగాణ ప్రజలు బిజెపిని నమ్మే పరిస్థితి లేదు – వినయ్ భాస్కర్

-

హన్మకొండ జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా హయాగ్రీవా చారీ గ్రౌండ్స్ నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ని జంఢా ఊపి ప్రారంభించారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. జాతీయ పతాకాలు చేతబూని ర్యాలీ లో పాల్గొన్నారు విద్యార్థులు, మహిళలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా దాస్యం విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. మూడు రోజుల వేడుకలు కాదు సంవత్సరం పొడవునా నిర్వహిస్తామన్నారు.

ప్రతి ఏటా టిఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బిజేపి రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి బిజేపి లబ్ది పొందాలని చూస్తుందన్నారు. అమిత్ షా వచ్చినా.. ఇంకెవ్వరు వచ్చినా తెలంగాణ ప్రజలు బిజేపిని నమ్మె పరిస్థితి లేదన్నారు. బిజేపి కి చిత్తశుద్ధి ఉంటే నూతనంగా నిర్మించే పార్లమెంటు కు డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి కేసిఆర్ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version