తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..ఎంసెట్ లో శాశ్వతంగా ఇంటర్ వెయిటేజీ తొలగింపు!

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్‌. ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలో జీవో వెలువడనుంది. ప్రస్తుతానికి ఈ ఏడాదికి ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటించినా శాశ్వతంగా తొలగిస్తూ జీవో జారీ చేయనుందని తెలిసింది.

ఇప్పటివరకు ఎంసెట్ మార్కులకు 75%, ఇంటర్లోని భాషేతర సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజి ఇచ్చి తుది ర్యాంకును నిర్ణయిస్తున్నారు. కరోనా కారణంగా 2020, 2021, 2022 ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించారు. ఈ ఎంసెట్ నుంచి ఇంటర్ మార్కులకు వెయిటేజీ శాశ్వతంగా ఉండదు. ప్రవేశ పరీక్షలో, తొలుత గణితం, ఆ తర్వాత భౌతికశాస్త్రం, చివరగా రసాయన శాస్త్రంలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. కొద్ది సంవత్సరాలుగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నందున ఒకటికి మించి ఎక్కువ ప్రశ్నపత్రాలు ఉండటంతో మార్కులు కాకుండా పర్సంటేజ్ ను లెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news