జగన్ చేతిలో ఒకసారి బడితెపూజ జరిగింది : పేర్ని నాని

-

నిన్న జనసేన ఆధ్వర్యంలో శ్రీకాకుళం రణస్థలంలో ఏర్పాటు చేసిన యువశక్తి సభలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటర్‌ వేశారు. తాజాగా పేర్ని నాని మాట్లాడుతూ.. ఈ సభలో పవన్ కల్యాణ్ అనేక అబద్ధాలు చెప్పినప్పటికీ, ఒకటి మాత్రం నిజం చెప్పాడని అన్నారు. మరోసారి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి వీరమరణం పొందలేనని చెప్పాడని, అందులో వాస్తవం ఉందని ఎద్దేవా చేశారు. గతంలో జగన్ చేతిలో ఒకసారి బడితెపూజ జరిగింది, ఈసారి కుక్కచావు చావడం ఎందుకని పవన్ నిజం చెప్పాడన్నారు. “తానెందుకు చంద్రబాబు సంకలో దూరాల్సి వస్తుందో చెప్పడానికే పవన్ ఈ సభ ఏర్పాటు చేశాడు.

యువతకు ఉద్యోగాలు, యువతకు ఉపాధి అంతా వట్టిదే. జగన్ మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అంటే పవన్ బాగా ఊగిపోతున్నాడు. ఉత్తరాంధ్రలో సత్యానంద్ వద్ద పవన్ నేర్చుకున్న విద్యే కదా ఇది. ఊగడం, ఆగడం ఆయనకు అలవాటే. చంద్రబాబుతో నీకు ఉన్నది అత్తా అల్లుడి సంబంధమో, మామా అల్లుడి సంబంధమో, దత్తతండ్రి, దత్తపుత్రుడి సంబంధమో… నీ నోటితో నువ్వే చెబుతున్నావు, మళ్లీ ఉలిక్కిపడుతున్నావు. చంద్రబాబు ఎదురింట్లో ఉన్న అత్త లాంటోడు, మామ లాంటోడు అని చెబుతున్నావు కదా, జగన్ మోహన్ రెడ్డి ఏం చెబుతున్నారంటే… అత్తా మామ కాదయ్యా దత్తతండ్రి అని చెబుతున్నారు. వరసే కదా తేడా!” అంటూ వ్యాఖ్యానించారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Latest news