వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీకి అధికారం అనేది చాలా ముఖ్యం. ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే టీడీపీ కనుమరుగయ్యే స్థితికి వెళ్లిపోతుంది. అందుకే ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. అటు చంద్రబాబు కూడా మునుపటి మాదిరిగా కాకుండా..ఈ సారి రూట్ మార్చి…పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళుతున్నారు. నాయకులు సరిగ్గా పనిచేయకపోతే వారికి గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు.
ఇటు నారా లోకేష్ సైతం దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే..గత ఎన్నికల్లో ఓటమి తర్వాత లోకేష్ రాజకీయం పూర్తిగా మారిపోయింది. తన శైలిని మార్చుకుని ఎఫెక్టివ్ గా రాజకీయం చేస్తున్నారు. అలాగే భవిష్యత్లో టీడీపీ పగ్గాలు చేపట్టే దిశగా ముందుకెళుతున్నారు..అందుకోసం తన టీంని ఇప్పటినుంచే రెడీ చేసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి లోకేష్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన త్వరలోనే పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సారి కొన్ని సీట్లని ఖచ్చితంగా గెలుచుకోవాలని లోకేష్ టార్గెట్ పెట్టుకున్నారట. ఆ సీట్లపై స్పెషల్గా ఫోకస్ చేసి పనిచేస్తున్నారట. తన టీంని ఆ నియోజకవర్గాల్లో పనిచేసేలా చూసుకుంటున్నారట. ఎప్పటికప్పుడు ఆ నియోజకవర్గ పరిస్తితులని పర్యవేక్షిస్తున్నారట. అలా లోకేష్ ఫోకస్ చేసిన స్థానాలు వచ్చి..గుడివాడ, గన్నవరం, గుంటూరు వెస్ట్, మాచర్ల, నెల్లూరు సిటీ, నర్సీపట్నం, అనకాపల్లి, నగరిలతో పాటు విశాఖపట్నం సిటీలోని నాలుగు సీట్లు, అటు కడపలో మూడు సీట్లలో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారట.
ఇటు ఎలాగో తన పోటీ చేయబోయే మంగళగిరిపై కూడా లోకేష్ గట్టిగానే ఫోకస్ చేశారు. ఈ సారి ఖచ్చితంగా ఈ సీట్లని గెలుచుకుని తీరాలని లోకేష్ పనిచేస్తున్నారట. అయితే వీటిల్లో గుడివాడ, గన్నవరంలపై ఇంకా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొడాలి నాని, వల్లభనేని వంశీలకు ఎలాగైనా చెక్ పెట్టాలనే కసితో లోకేష్ ఉన్నారు. మరి లోకేష్ టార్గెట్ రీచ్ అవుతారో లేదో చూడాలి.