జగన్ సర్కార్ కు షాక్ : టీటీడీ పాలకమండలి పై హైకోర్టులో పిటిషన్

జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఏర్పాటు పై… ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఉమామహేశ్వర నాయుడు… హైకోర్టులో ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఎండోమెంట్ ఆక్ట్ 1987 కు విరుద్ధంగా టీటీడీ పాలక మండలి బోర్డు నియామకం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు టిడిపి నేత ఉమా మహేశ్వర నాయుడు.

జంబో బోర్డుతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పవని హైకోర్టుకు పిటిషన్ ద్వారా స్పష్టం చేశారు ఉమామహేశ్వర నాయుడు. అయితే ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. టీటీడీ పాలక మండలి ఏర్పాటు పై పిటిషన్ దాఖలు కావడంతో.. జగన్ సర్కార్ కు ఊహించని షాక్ తగిలింది. కాగా ఈ టిటిడి బోర్డును వారం రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాటు చేసిన సంగతి విధితమే. 24 మంది సభ్యులు మరియు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు లతో ఈ పాలక మండలి నీ ప్రకటించింది ఏపీ సర్కార్.