వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలోనే పెట్రోల్ ధరలు తగ్గుతాయని కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్ పై లీటరుకు రూ.10 వరకు లాభాలు చూస్తున్నాయని, అదే సమయంలో డీజిల్ పై నష్టపోతున్నాయని వెల్లడించారు. గతేడాది అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని మోపకుండా ఆయిల్ కంపెనీలు బాధ్యతతో వ్యవహరించాయని ప్రశంసించారు.