వీర సింహారెడ్డి సినిమా కోసం బాలయ్య పారిపోషకం అన్ని కోట్లా..?

-

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసి మొదటి షో తోనే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా అఖండ సినిమా మొదటి రోజు కలెక్షన్లను కూడా బ్రేక్ చేసింది ఈ సినిమా. నిజానికి బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో భారీ పాపులారిటీని దక్కించుకున్న బాలయ్య.. ఇప్పుడు ఆరుపదుల వయసు దాటినా కూడా ఇలా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు.

ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమాతో వచ్చి మరో బ్లాక్ బస్టర్ విషయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇందులో శృతిహాసన్ , హనీ రోజ్ హీరోయిన్లుగా నటించగా.. బాలయ్య ద్విపాత్రాభినయం నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరొకవైపు వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలు పోషించారు. సిస్టర్ సెంటిమెంటుతో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలాగే మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది . ముఖ్యంగా బాలయ్య అభిమానులు థియేటర్ లను జై బాలయ్య అనే నినాదాలతో హోరెత్తించారు.

ఇంత భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా కోసం బాలయ్య మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎంత పారితోషకం తీసుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ ఈ సినిమా కోసం రూ.20 కోట్ల పారితోషకం తీసుకున్నారని సమాచారం. మొత్తానికైతే అఖండ సినిమాతో రూ.12 కోట్ల పారిపోషకం తీసుకున్న ఈయన ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా కోసం భారీగా పెంచేసారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news