కృష్ణా నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతున్న విషయం తెల్సిందే. తెలంగాణ మంత్రులు ఉమ్మడి పాలకులతో పాటు ఏపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. అటు ఏపీ నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాల నేతల మధ్య పరస్పర ఆరోపణల నేపథ్యంలో… తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి ఏపీ సర్కార్ పై మండిపడ్డారు.
వైయస్ రాజశేఖర్రెడ్డి ఆనాడు తెలంగాణా ప్రజల నోట్లో మట్టి కొట్టారు… ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ కూడా అదే పని చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. కృష్ణా జలాలు దోచుకుంటున్న దొంగను దొంగే అంటామని… జగన్ కు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ను అడ్డుకుని తీరుతామని వార్నింగ్ ఇచ్చారు పువ్వాడ అజయ్. ఇప్పటికే కేంద్రానికి మా అభ్యంతరం తెలియజేశామని అవాకులు.. చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే… చూస్తూ ఊరుకోడానికి మేమే గాజులు తొడుక్కో లేదని ఫైర్ అయ్యారు.