కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ పై రూ. 5, రూ. 10 తగ్గించిన విషయం తెలిసిందే.. కాగా దీనికి అనుగుణంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డిజిల్ పై వేసే పన్నులను తగ్గించాయి. అయితే ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో బీజేపీ పార్టీ పెట్రోల్ ,డిజిల్ రేట్లను తగ్గించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. తాజాగా నేడు ఏపీలో పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ బీజేపీ ధర్నాలకు పిలుపునిచ్చింది. ఏపీ బీజేసీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు ధర్నాల్లో పాల్గొననున్నాయి. కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాల ముందు పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించాలంటూ నిరసనలు చేయనున్నారు. అన్ని జిల్లాల కేంద్రాలు, పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 నుంచి 12 వరకు భారీ నిరసన చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ప్రభుత్వం పెట్రోల్ ధరలపై దిగి రాకుంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని హెచ్చిరించాడు.
పెట్రోల్ డిజిల్ రేట్లు తగ్గించాలంటూ… నేడు ఏపీలో బీజేపీ ధర్నాలు.
-