మరోసారి పెట్రల్ రేట్లు పెరుగనున్నాయా… మరోసారి సామాన్యుడికి షాక్ తప్పదా అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉందని డెలాయిట్ ఇండియా ఎల్ఎల్పీ తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నా.. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత వస్తుందనే ఉద్దేశ్యంతో చమురు కంపెనీలు ధరలు పెంచడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈరోజు నుంచి ఎన్నిలకు ప్రారంభం కానున్నాయి. యూపీలో నేడు తొలి దశ పోలింగ్ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లోనే పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటి ఫలితాలు మార్చి 10న వెల్లడికానున్నాయి. ఇదిలా ఉంటే మార్చి 10 అనంతరం పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లీటర్ పై రూ. 8-9 వరకు పెరుగుతాయని అంచానా. మరోసారి పెట్రోల్ రేట్లు పెరిగితే నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం పడనుంది.