తాజాగా ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

-

ఈ నెల 17వ తేదీన నాగశౌర్య నటించిన ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే… కాగా, నాగశౌర్యకి లవర్ బాయ్ గా మంచి క్రేజ్ ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మద్దతు ఉంది. ఆయన చేసిన ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ సినిమా ఆ కోవకి చెందినదే. విశ్వప్రసాద్ – దాసరి పద్మజ నిర్మించిన ఈ సినిమాకి, అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మాళవిక నాయర్ అలరించనుంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Phalana Abbayi Phalana Ammayi Lyrical Song Released

ఈ నేపథ్యంలో తాజాగా ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘నీతో ఈ గడిచిన కాలం .. నడిచిన దూరం ఎంతో ఇష్టం’ అంటూ ఈ మెలోడీ గీతం సాగుతోంది. కల్యాణి మాలిక్ తాను స్వరపరిచిన ఈ పాటను గీత మాధురితో కలిసి ఆలపించారు, భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. చాలా కాలం తరువాత వినిపించిన ఒక మంచి మెలోడీగా ఈ పాటను గురించి చెప్పుకోవచ్చు. హీరో, హీరోయిన్లపై ఈ పాటను అందమై, ఆహ్లాదకరమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news