మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనగోలు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఫాంహౌస్ కేసులో తాము అనుకున్నదే జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీలను వాడుతారని ముందే తెలుసని అన్నారు పైలట్ రోహిత్ రెడ్డి. న్యాయవ్యవస్థపై తమకు పూర్తిగా నమ్మకం ఉందన్న ఆయన.. ఈడీ విచారణలో ఏం దొరకనందునే సీబీఐని రంగంలోకి దించారని ఆరోపించారు పైలట్ రోహిత్ రెడ్డి. ఫాంహౌస్ కేసు ఈడీ పరిధిలోకి రాకపోయినా తనను విచారించారని చెప్పారు పైలట్ రోహిత్ రెడ్డి. బీజేపీ నాయకులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని పైలట్ రోహిత్ రెడ్డి విమర్శించారు.
తనను జైలుకు పంపినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు పైలట్ రోహిత్ రెడ్డి. ఈడీ విచారణపై రిట్ దాఖలు చేశామని రోహిత్ రెడ్డి చెప్పారు. బీజేపీ చెప్పిందే జరుగుతోందని.. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చాక కార్యాచరణను ప్రకటిస్తామని పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఫాంహౌస్ కేసు సిట్ను కాదని సీబీఐకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. సిట్ అధికారులకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందని పైలట్ రోహిత్ రెడ్డి చెప్పారు. తాము తప్పుచేయలేదని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు పైలట్ రోహిత్ రెడ్డి. స్వామిజీలతో సంబంధం లేదని చెప్తూనే బీజేపీ నిందితులకు సహకరిస్తోందని రోహిత్ రెడ్డి ఆరోపించారు. అభిషేక్కు సంబంధం లేకున్నా ఈడీ విచారణకు పిలిచారన్నారు. కోర్టులో ఎవిడెన్స్ కాపీలు తనకు ఇచ్చారని.. వాటినే సీఎం కేసీఆర్కు ఇచ్చానని పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు.