ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు షాక్‌.. మెటా కీలక నిర్ణయం..

-

ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలన్‌ మస్క్‌ ఉద్యోగుల తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మెటా సంస్థ కూడా అదే దారిలో ఉంది. ఉద్యోగుల తొలగింపునకు ఇప్పుడు ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’ కూడా సిద్ధమైంది. ఈ వారంలో ఉద్యోగులకు పెద్ద ఎత్తున లేఆఫ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. ఈ విషయంతో సంబంధం ఉన్న ఉద్యోగి ఒకరు ఈ విషయం చెప్పినట్టు తన కథనంలో తెలిపింది. కరోనా తర్వాత పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నప్పటికీ ఉద్యోగాల కోతలు పెరుగుతుండడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వేలాదిమంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమైందని, బుధవారం నాటికి ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన ప్రకటన వస్తుందని తెలుస్తోంది.

How To Delete Facebook Data Forever | Time

సెప్టెంబరు చివరి నాటికి 87 వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నట్టు మెటా పేర్కొంది. కాగా, ఈ వారంలో అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ‘మెటా’ ఇప్పటికే ఉద్యోగులకు సూచించినట్టు సమాచారం. ఫేస్‌బుక్ 18 సంవత్సరాల చరిత్రలో ఈ స్థాయిలో ఉద్యోగుల కోత ఉండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ ధనికుడు ఎలాన్ మస్క్ సంస్థలోని ఉద్యోగులను సగానికి సగం తగ్గిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే పలు విభాగాల హెడ్‌లపై వేటు వేయగా, పలువురు ఉద్యోగులను కూడా తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో ఫేస్‌బుక్ నడుస్తుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కాగా, ఉద్యోగుల తొలగింపు వార్తలపై స్పందించేందుకు ఫేస్‌బుక్ ప్రతినిధి నిరాకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news