Mr360 ప్లేయర్ కాదు..వీడు Mr.1080

-

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ ప్రత్యర్థిని ఖరారు చేసుకుంది. నేడు సూపర్-12 దశ గ్రూప్-2లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ టాపర్ గా నిలిచిన టీమిండియా… గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ తో సెమీస్ లో తలపడనుంది.

అయితే.. ఈ మ్యాచ్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ తో అదరగొట్టాడు. దీంతో సూర్య ఇన్నింగ్స్ పై ప్రశంసలు వస్తున్నాయి. బ్యాక్ వర్డ్, అప్పర్ కట్, లాంగాన్, స్క్వేర్ లెగ్, కవర్ డ్రైవ్, ఇలా అన్ని షాట్లను ట్రై చేశాడు. ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళుతున్న బంతుల్ని ఎడమవైపు బౌండరీ దాటించడం హైలెట్. అతని బాడీలో స్ప్రింగ్ లు ఉన్నాయా? అనే డౌట్ తప్పక వస్తుంది. అతను Mr360 ప్లేయర్ కాదు, Mr1080 ఆటగాడని, ఇలాంటి షాట్లు క్రికెట్ లో అసాధ్యమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news