ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త అందజేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేసింది. రాత పరీక్షల సవరణ షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ అనౌన్స్ చేసింది. టీటీడీ కళాశాలలో రాత పరీక్ష తేదీలను వాయిదా వేస్తున్నట్లుగా స్పష్టం చేసింది.

మిగతా పరీక్షలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించింది. మరోవైపు ఆల్ ఇండియా సర్వీస్ రాష్ట్ర సర్వీస్ అధికారులు అర్ధవార్షిక లాంగ్వేజ్ టెస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రణాళిక విడుదల చేసింది. దీంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీ వాసులకు అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది.