బెయిల్ ఇవ్వండి ప్లీజ్.. కోర్టులో ప్రాధేయపడిన జానీమాస్టర్!

-

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన విషయం తెలిసిందే.తన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ మీద లైంగికదాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేయగా అతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ క్రమంలోనే తను జాతీయ అవార్డు అందుకోవాలని, దానికోసం బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఓవైపు నార్సింగి పోలీసులకు ఇచ్చిన 4 రోజుల కస్టడీ ముగియడంతో జానీని మళ్లీ ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టి చంచల్ గూడ జైలుకు తరలించారు.

 

అక్టోబర్ 3వరకు జానీ రిమాండ్ ఖైదీగా ఉండనున్నాడు. కాగా, 5 రోజులు తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో జానీ మాస్టర్ పిటిషన్ వేశాడు.‘నాకు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ వచ్చింది.దానికోసం ఢిల్లీ వెళ్లి అవార్డు అందుకోవాల్సి ఉంది.అందుకోసం 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వండి’ అని కోర్టులో ప్రాధేయపడ్డాడు.ఈ పిటిషన్‌పై అక్టోబర్ 7న విచారిస్తామని రంగారెడ్డి పోక్సో కోర్టు వెల్లడించింది. నిందితుడు బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే అతనికి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్ వేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version