మీరు ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSCఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… UPSC ESE 2022 ఎగ్జామ్‌కు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 22, 2021 నుంచి ప్రారంభమవుతుంది.
దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12, 2021 ఆఖరి తేదీ. దరఖాస్తు చేసే అభ్యర్థులు ముందుగా పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చెయ్యాలి. ఫిబ్రవరి 20 2022న యూపీఎస్సీ ఈఎస్ఈ ఎగ్జామ్ నిర్వహించనుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ ద్వారా ఉంటుంది. దీనిలో మొత్తం 247 పోస్టులు వున్నాయి.
వయోపరిమితి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ఓపెన్ చేసి వివరాలు చూడొచ్చు. అభ్యర్థులు రూ.200 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు పరీక్ష ఫీజు లేదు. పరీక్ష హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం లో నిర్వహిస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్లై చేసుకోచ్చు. ఎంపిక విధానం గురించి చూస్తే.. ఇంజనీరింగ్ సర్వీస్ ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహిస్తారు. నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: upsconline.nic.in