ఫిబ్రవరి 14, 2019.. భారతదేశంలో ఓ చీకటి రోజు. CRPF జవాన్లు వెళ్తున్న బస్సును ఓ సూసైడ్ బాంబర్ 100 కేజీల లోడ్ చేసిన కారుతో ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అమరులయ్యారు. సైనికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిధ్రమయ్యాయి. ఈ సంఘటన జరిగి 4 ఏళ్లు పూర్తి అయింది అయితే.. తాజాగా పుల్వామా దాడిపై జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుల్వామా దాడి మోడీ వల్లే జరిగిందన్నారు జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్. పుల్వామా దాడి జరిగినప్పుడు జవాన్లని తీసుకెళ్ళడానికి సీఆర్పీఎఫ్ జవాన్లు రాజ్నాథ్ సింగ్ను 5 హెలికాప్టర్లు అడిగితే ప్రభుత్వం నిరాకరించిందని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఈ విషయంపై మోడీ, అజిత్ దోవల్ ఇద్దరూ నన్ను మాట్లాడొద్దు అన్నారన్నారు జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్.
పుల్వామా దాడి మోడీ వల్లే జరిగింది-జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్
పుల్వామా దాడి జరిగినప్పుడు జవాన్లని తీసుకెళ్ళడానికి సీఆర్పీఎఫ్ జవాన్లు రాజ్నాథ్ సింగ్ను 5 హెలికాప్టర్లు అడిగితే ప్రభుత్వం నిరాకరించింది
ఈ విషయంపై మోడీ, అజిత్ దోవల్ ఇద్దరూ నన్ను మాట్లాడొద్దు అన్నారు pic.twitter.com/avVNXUg15G
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2023