అమ‌ర్‌సింగ్ గొప్ప నాయ‌కుడు: మోదీ..!

సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు అమ‌ర్‌సింగ్ మృతిప‌ట్ల ప్ర‌ధాని ‌మోదీ స్పందించారు. అమ‌ర్‌సింగ్ గొప్ప నాయ‌కుడ‌ని కొనియాడారు. దేశ రాజ‌కీయాల్లో అమ‌ర్‌సింగ్ త‌న‌దైన శైలిలో చ‌క్రం తిప్పాడ‌ని మోదీ పేర్కొన్నారు. అమ‌ర్‌సింగ్ అకాల మ‌ర‌ణ‌వార్త చాలా బాధ క‌లిగించింద‌న్నారు. ఆయన మృతికి సంతాపం ప్ర‌క‌టించి కుటుంబ‌ స‌భ్యులు, బంధు మిత్రుల‌కు ప్ర‌ధాని ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ఈ మేర‌కు మోదీ ట్వీట్ చేసారు. కాగా, అమర్‌సింగ్‌ 1996లో తొలిసారి యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2003 జూన్‌లో కూడా రాజ్యసభకు ఎన్నికయ్యారు.

2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అణు ఒప్పందం విషయంలో అమర్‌సింగ్‌ వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న సందర్భంలో సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో కీలకంగా వ్యవహరించారు. 2010వ సంవత్సరంలో అమర్‌సింగ్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో సినీనటి జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత తాజాగా 2016లో కూడా ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు.