మరో పదేళ్లలో భారత్ ఇంధనానికి భారీ డిమాండ్ : ప్రధాని మోదీ

-

ఇంధన రంగంలో పెట్టుబడులకు ప్రస్తుతం అపార అవకాశాలు భారతదేశంలోనే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశీయంగా అధిక ఇంధన గిరాకీ, స్థిరమైన నాయకత్వం, సంస్కరణలు వంటివి అంతర్జాతీయ పెట్టుబడులకు అనువుగా ఉన్నాయని వెల్లడించారు. ‘ఇండియా ఎనర్జీ వీక్‌ 2023’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

మరో పదేళ్లలో ప్రపంచంలో భారతీయ ఇంధనానికే భారీ డిమాండ్ ఉంటుందని మోదీ తెలిపారు. అంతర్జాతీయ ఇంధన సంఘం లెక్కల ప్రకారం.. ప్రపంచ చమురు గిరాకీలో భారత వాటా 5 శాతంగా ఉందని, ఇది 11 శాతానికి పెరగొచ్చని వెల్లడించారు. గ్యాస్‌ డిమాండ్ 500 శాతం అధికం కావొచ్చన్నారు. భారత ఇంధన రంగానికి సంబంధించి అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కార్పొరేట్లకు సూచించారు.

“2030 నాటికి ఇంధన మిశ్రమంలో సహజవాయువును వినియోగించేందుకు కృషి చేస్తున్నాం. విద్యుత్తు వాహనాలు, హైడ్రోజన్‌ ద్వారా కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలు క్రమంగా సాధిస్తున్నాం. ప్రస్తుతం దేశ వార్షిక చమురు శుద్ధి సామర్థ్యం 250 మెట్రిక్‌ టన్నులు ఉండగా దీన్ని 450 ఎంఎంటీపీఏకు చేర్చనున్నాం. ఈ- ఇంధనం, 2జీ ఎథనాల్‌ బయో రిఫైనరీ రంగంలోనూ 12 వాణిజ్య 2జీ ఎథనాల్‌ ప్లాంట్లను తయారీకి సన్నాహకాలు చేస్తున్నాం.” అని మోదీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news