చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇండియాను వదలడం లేదు. రోజురోజుకు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా… కొత్త వేరియంట్ పేరుతో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి. ఇలాంటి తరుణంలో… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ… నేడు అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఇవాళ ఉదయం 10:30 గంటలకు… వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా కొత్త వేరియంట్ లపై… ఉన్నతాధికారులతో… ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి… పలువురు మంత్రులు కూడా హాజరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఇండియాలో గడిపిన 24 గంటల్లో … 8318 కరోనా కేసులు, 465 మరణాల నమోదు అయ్యాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా…107019 యాక్టింగ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 10,967 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా 3,39,88,797 మంది కరోనా నుంచి కోలుకుని… ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4,66,933 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.