కొవిడ్-19పై ప్రధాని అత్యవసర సమావేశం.. కఠిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం

కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రమాదకరమైందన్న డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. మరోవైపు దేశంలో కొవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం ఉదయం 10.3గంటలకు అత్యున్నత అధికారుల సమావేశం నిర్వహించనున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి సమావేశం నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయమై ఆసక్తి నెలకొంది. మళ్లీ కఠిన ఆంక్షలు విధించే అవకాశం స్పష్టం కనిపిస్తుంది.