అల్లు అర్జున్ బిగ్ షాక్‌.. పుష్ప సినిమాపై పోలీస్ కేసు !

పుష్ప చిత్ర బృందానికి వ‌రుస గా షాకులు త‌గులుతున్నాయి. తాజాగా పుష్ప నిర్వ‌హ‌ణ సంస్థ శ్రేయాస్ మీడియా పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప‌రిమితికి మించి.. పాసులు జారీ చేశారని.. అలాగే.. నిన్న పుష్ప ప్రీ రి లీజ్ ఈవెంట్ లో జ‌రిగిన తొక్కిస లాట పై జూబ్లిహిల్స్ పోలీసులు సీరియ‌స్ అయ్యారు.

ఈ నేప‌థ్య‌లోనే.. తాజాగా పుష్ప సినిమా పుష్ప ప్రీ ఈవెంట్ పంక్ష‌న్ నిర్వ‌హణ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీనిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు చెబుతున్నారు. కాగా సమంత నటించిన పుష్ప ఐటమ్ సాంగ్ పై ఇవాళ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. పురుషుల మనోభావాలను ఆ సాంగ్ లిరిక్స్ దెబ్బతీశారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు న‌మోదు అయింద‌నుకునేలోపే.. మ‌రో కేసు న‌మోదు కావ‌డం… పుష్ప ఫ్యాన్స్ ను క‌ల‌వ‌ర పెడుతోంది.