చంద్రబాబుపై మళ్ళీ కేసు… ఈసారి ఎక్కడ అంటే…!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై కేసు నమోదు చేసారు పోలీసులు. మైలవరం పోలీస్ స్టేషన్ లో న్యాయవాదులు ఫిర్యాదు చేసారు. బాధ్యత కలిగిన మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు N440K వైరస్ ప్రాణాలు తీస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల్లో స్థైర్యాన్ని నింపాల్సింది పోయి భయాందోళనలకు గురి చేయడంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

న్యాయవాదులు ఓర్సు శ్రీనివాస్ మరియు పజ్జూరి సాంబశివరావు ఈ కేసు నమోదు చేసారు. ఇటీవల చంద్రబాబు నాయుడు పై వరుసగా పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. కర్నూలు ఆ తర్వాత గుంటూరు, నరసారావు పేట, నేడు మైలవరం లో కేసులు నమోదు చేసారు.