రఘురామ కుమారుడి రియాక్షన్ ఏంటీ…?

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్ పై ఆయన కుమారుడు భరత్ మీడియాతో మాట్లాడారు. రఘురామ ఎంపీ అని కూడా చూడకుండా భద్రతా సిబ్బందిని పక్కకు తోసేసారు అంటూ విమర్శించారు. ఎందుకు అరెస్ట్ చేసారు అని అడిగితే కోర్ట్ కి వెళ్లి చూసుకోవాలని వాళ్ళు చెప్పారని, అసలు ఎందుకు అరెస్ట్ చేసారో చెప్తే కదా కోర్ట్ కి వెళ్ళేది అంటూ వ్యాఖ్యానించారు. సివిల్ డ్రెస్ లో వచ్చి అదుపులోకి తీసుకున్నారని అసలు వాళ్ళు సిఐడీ అధికారులో కాదో తెలియదని అన్నారు.

వారెంట్ లేకుండా తన తండ్రిని అరెస్ట్ చేసారని రఘురామను ఎక్కడికి తీసుకువెళ్ళారో తెలియదని మండిపడ్డారు. అసలు ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా అంటూ ప్రశ్నించారు. రఘురామ ఆరోగ్యం కూడా బాగా లేదని హార్ట్ పేషెంట్ అని తెలిసి కూడా అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. సెక్యూరిటీ ని కూడా లెక్క చేయలేదని ఎంపీ అని కూడా చూడకుండా దౌర్జన్యం చేసారని, దీనిపై హౌస్ మోషన్ పిటీషన్ హైకోర్ట్ లో దాఖలు చేస్తామని అన్నారు.