సాయితేజ్ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కీలక ప్రకటన

సాయిధరమ్ తేజ రోడ్డు ప్రమాదంపై విచారణ ప్రారంభం అయిందని మాదాపూర్ పోలీసులు ప్రకటించారు. రోడ్డు ప్రమాదం పై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు… సాయి ధర్మ తేజ ఎక్కడినుంచి ఎక్కడికి వెళుతున్నారు అనే దానిపై విచారణ ప్రారంభించారు. సాయి ధర్మ తేజ ఇంటి దగ్గర్నుంచి నరేష్ ఇంటికి వెళ్ళిన దానిపై ఆరా తీస్తున్న పోలీసులు.. నరేష్ ఇంటి దగ్గర్నుంచి అతని కొడుకు తో కలిసి బయటికి వెళ్లి ఈ విషయంపై ఆరా తీస్తున్నారు.

బైక్ రేసింగ్ పాల్పడ్డారన్న అనుమానాలపై ఆరా తీస్తున్న పోలీసులు.. నరేష్ కుమారుడు, సాయి ధర్మ తేజ ఇద్దరు కలిసి ఎటు వెళ్తున్నారన్న దానిపై విచారణ ప్రారంభించారు. జిహెచ్ఎంసి రోడ్డు కాంట్రాక్టర్ పై చర్య తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే డయల్ 100 కి ఫోన్ వచ్చిందని మాదాపూర్ డిసిపి పేర్కొన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారని…సాయిధర్మ తేజ కోలుకున్న తర్వాత విచారిస్తామన్నారు.

సాయి ధర్మ తేజ్ ని విచారిస్తే కానీ అసలు విషయం బయటికి రాదని.. ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నారనే విషయం సాయిధర్మతేజ్ అనే చెప్పాలన్నారు.. బైక్ రేసింగ్ లకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని.. ఇప్పటికే సాయిధర్మతేజ్ పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పేర్కొన్నారు. అవసరమైన పక్షంలో నరేష్ , అతని కొడుకును కూడా స్టేట్ మెంట్ రికార్డు చేస్తామన్నారు.