అగ్రిగోల్డ్ ధ‌ర్నారు అడ్డుకున్న పోలీసులు

-

Agri Gold customers rally foiled, scores of customers arrested in Vijayawada
విజ‌య‌వాడ నగరంలోని ధర్నా చౌక్‌ వద్ద అగ్రిగోల్డ్‌ బాధితులు 30 గంటల పాటు ధర్మాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి అగ్రిగోల్డ్‌ బాధితులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీక్ష సందర్భంగా ర్యాలీకి ప్రయత్నించిన అగ్రిగోల్డ్‌ బాధితులను పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. అంతేకాకుండా అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావుతో పాటు పలువురు మ‌హిళా బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని అగ్రిగోల్డ్‌ బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news