రెండుకళ్ల సిద్ధాంత ఫలితం: అఖిల అటు వైపు… సుబ్బారెడ్ది ఇటు వైపు?

-

అఖిలప్రియ – ఏవీ సుబ్బారెడ్డిల వ్యవహారం సీమ పాలిటిక్స్ లోనె కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు తనకు ఏమాత్రం అనుకూలంగా లేరని, కనీసం ఏమి జరిగింది.. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని కూడా పలకరించలేదని, పార్టీ నుంచి తమకు ఎలాంటి సపోర్ట్ లేదని అఖిల ప్రియ వాపోతున్నారంట. బాబు పద్దతులు ఆమెకు తెలియదో ఏమో కానీ… అఖిల ప్రియ బాద అలా ఉందంట. ఆమె సంగతులు అలా ఉంటే… బాబు గాలి, ఏవీ సుబ్బారెడ్డి ఎప్పుడో తీసేశారు.

టీడీపీ చెప్పినా, ఆ పార్టీ అధినేత చెప్పినా, ఎవరు చెప్పినా అఖిలప్రియ తనను హత్య చేయించాలని సుపారీ ఇచ్చిన వ్యవహారంలో రాజీపడే ప్రసక్తి లేదని ఏవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పేశారు! అంటే… చంద్రబాబుకు కూడా ఏవీ డోర్లు మూసేసినట్లే… అంటే పరోక్షంగా టీడీపీని వదులుకున్నట్లే అని అంటున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలకూ రాజకీయంగా నీడ చాలా అవసరం కాబట్టి… అఖిల ప్రియ కాషాయం కండువా కప్పుకోవాలని భావిస్తున్నారంట. ఇప్పటికే భూమా కుటుంబంలో ఒకరు బీజేపీలో ఉండటంతో.. అఖిలకు అక్కడ పని సులువు అవుతుందని భావిస్తున్నారట!

ఆమె అలా చూస్తుంటే… ఏవీ సుబ్బారెడ్డి వైకాపా వైపు చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏవీ వైకాపా పెద్దలను సంప్రదిస్తున్నారా.. వైకాపా పెద్దలే ఏవీని ఆహ్వానిస్తున్నారా అనే విషయాలపై ఇంకా క్లారిటీ రానప్పటికీ… వెళ్లడం మాత్రం పక్కా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంతపని చేసిందని సీమ తమ్ముళ్లు వాపోతున్నారంట.

ఈ విషయంలో చినికి చినికి గాలివానకాకముందో, తర్వాతో అయినా కనీసం బాబు వీరిద్దరితో మాట్లాడి ఉండాల్సిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా జరిగి ఉంటే… కనీసం ఇద్దరిలో ఒకరైనా మిగిలేవారు! ప్రతీ విషయంలోనూ రెండుకళ్ల సిద్ధాంతాన్నే పాటించే బాబు… ఆఖరికి ఈ విషయంలో కూడా అలాంటి సిద్ధాంతాన్నే నమ్ముకోవడం వల్ల రెండూ పోయాయని అంటున్నారు. ఏది ఏమైనా… అసలు మూలిగేనక్క ఆపై దానిమీద తాటికాయ పడింది!!

Read more RELATED
Recommended to you

Latest news