తాను రెండు సార్లు ఓడిపోవడానికి కోమటిరెడ్డి సోదరులే కారణమని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో ఒక స్థానం ఓసీ, మరో స్థానం బీసీకి ఇవ్వాలని తాము కోరామని ఆయన అన్నారు..
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నా ఉసురు ఖచ్చితంగా తగులుతుంది.. వాళ్లు సర్వనాశనం కావాలి.. అని మండిపడ్డారు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య. ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇవాళ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు.
తాను రెండు సార్లు ఓడిపోవడానికి కోమటిరెడ్డి సోదరులే కారణమని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో ఒక స్థానం ఓసీ, మరో స్థానం బీసీకి ఇవ్వాలని తాము కోరామని.. అయితే కాంగ్రెస్ పార్టీ అలా ఇవ్వలేదని.. సామాజిక వర్గానికి, బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం అమలు కాకుండా చేసిన కోమటిరెడ్డిని వ్యతిరేకించే పార్టీని మారుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ పాలనకు ఆకర్షితుడినై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ఆయన వెల్లడించారు.