” రాజీనామా చేయండి ” వాళ్ళని ఆదేశించిన బాబు – వాళ్ళు చెప్పిన ఆన్సర్ కి బాబు మైండ్ బ్లాక్ ? 

అమరావతి రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో పోరాడుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఏపీ సీఎం వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి గతంలో అభివృద్ధి అంతా ఒకచోట జరిగిన హైదరాబాద్ నగరం కోల్పోవడం వల్ల ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడి పోయిందని అటువంటి పరిస్థితి భవిష్యత్ తరాల్లో రాకుండా ఉండాలని వికేంద్రీకరణ పేరిట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధిలో పాలి భాగస్తులు కావాలని మూడుచోట్ల రాజధాని ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తెరపైకి తీసుకురావడంతో అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులను జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర స్థాయిలో ఆందోళన నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఇటువంటి నేపథ్యంలో జగన్ దమ్ముంటే అమరావతి ప్రాంతాన్ని రెఫరెండం గా తీసుకుని రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని అప్పుడు మళ్లీ జగన్ గెలిస్తే ఖచ్చితంగా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అంటూ చంద్రబాబు కామెంట్ చేయడం జరిగింది.

 

ఇదిలా ఉండగా తాజాగా అమరావతి పరిసర ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని చంద్రబాబు ఆదేశించగా రాజధాని పరిసర ప్రాంతంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ససేమిరా  అన్నారట…టిడిపి పార్టీ ని చూసి కాదు మమ్మల్ని చూసి మా ప్రాంతంలో ఉన్న ప్రజలు మాకు ఓటు వేశారు అని చెప్పటంతో వాళ్ళు చెప్పిన ఆన్సర్ కి బాబు మైండ్ బ్లాక్ అయినట్లు సమాచారం.