అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మరియు భారత ప్రభుత్వ అధికారులు డోనాల్డ్ ట్రంప్ కి భారీగా స్వాగతం పలికారు. భారతీయ సాంప్రదాయ బద్ధంగా విమానాశ్రయం నుండి అహ్మదాబాద్ స్టేడియం వరకు భారీగా జనం స్వాగతం పలుకుతూ నమస్తే డోనాల్డ్ ట్రంప్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే తరుణంలో ట్రంప్ ఇండియాలో అడుగుపెట్టగానే ఆయన పర్యటించే ప్రాంతాలన్నీ ముందుగానే అమెరికన్ సీక్రెట్ సర్వీస్ రక్షణ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది.
ఇదే సందర్భంలో చుట్టుప్రక్కల ప్రాంతాలను కూడా తమ అధీనంలోకి తీసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా ఒక చోట ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ కూడా ఉన్న సమయంలో వాళ్లను కూడా వెళ్లిపోవాలని అమెరికన్ సీక్రెట్ సర్వీస్ రక్షణ సిబ్బంది కోరటంతో ఈ వార్త జాతీయ మీడియాలో పెద్ద హైలెట్ న్యూస్ గా మారింది.
అది డోనాల్డ్ ట్రంప్ ఇండియాలో అడుగుపెట్టగానే ఇది జరగటంతో అమెరికన్ సీక్రెట్ సర్వీస్ శాసించడం తో భారత్ ఆర్మీ కి గుండెలు జారిపోయేట్టు పరిస్థితి మారింది. చాలామంది ఈ న్యూస్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. మన దేశంలో మన ఆర్మీ ని శాసించే విధంగా పొరుగుదేశం వ్యవహరించడం చాలా దారుణమైన సంఘటన అంటూ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ పై విమర్శలు చేస్తున్నారు.