అమ్మ ఒడి : 1.14 శాతం మందికే రాలేద‌ట‌!

-

జ‌గ‌నన్న అమ్మ ఒడి ప‌థ‌కం కేవ‌లం 1.14 శాతం మాత్రమే రాలేద‌ని సీఎం జ‌గ‌న్ అంటున్నారు.ఇవాళ శ్రీ‌కాకుళం కేంద్రంగా ఆయ‌న మూడో విడ‌త అమ్మ ఒడి కార్యక్ర‌మాన్ని లాంఛ‌నంగా ప్రారంభించి, సంబంధిత ఆర్థిక ల‌బ్ధిని నేరుగా తల్లుల ఖాతాల్లోకి జ‌మ చేశారు.అయితే విపక్షాలు చేస్తున్న‌వి, చెబుతున్న‌వి అన్నీ అబ‌ద్ధాలే అని తేల్చేశారు. తాను ఒక్క‌డినే ఒంట‌రి పోరు చేస్తూ దుష్ట చ‌తుష్ట‌యంతో త‌ల‌ప‌డుతున్నాన‌ని మ‌రో మారు కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఎప్ప‌టిలానే ఆ న‌లుగురినీ టార్గెట్ చేసుకుని మాట్లాడినా విమ‌ర్శ‌ల్లో మాత్రం పెద్ద‌గా ప‌దాల తీవ్ర‌త అయితే లేదు. అలానే ఎన్న‌డూ లేనిది సీఎం జిల్లా నాయ‌కుల‌తో మాట్లాడేందుకు ఎక్కువ మొగ్గు చూప‌డం కూడా బాగుంది. అదే ప‌నిగా విప‌క్షాల‌ను అయితే అటు మంత్రి బొత్స కానీ ఇటు మంత్రి ధ‌ర్మాన కానీ తిట్ట‌లేదు. కానీ చెప్పాల‌నుకున్న‌ది జ‌గ‌న్ కానీ ఇత‌ర మంత్రులు కానీ సూటిగానే చెప్పారు. పిల్ల‌ల కార్య‌క్ర‌మం క‌దా ! గొప్ప ఉత్సాహంతో వాళ్లు కేరింత‌లు కొడుతూ ఉంటే జ‌గ‌న్ కూడా అదే ఉత్సాహాన్ని వారి నుంచి అందుకుని మాట్లాడ‌డ‌మే ఇవాళ్టి వేళా విశేషం.

- Advertisement -

ఎ పార్ట్ ఫ్ర‌మ్ దిస్ … గుడ్ గాళ్ నిహారిక ..

స‌భ‌లో నిహారిక అనే చిన్నారి (శ్రీ‌కాకుళం ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల విద్యార్థిని) ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అమ్మ ఒడితో పాటు ఇత‌ర ప‌థ‌కాల ఆవ‌శ్య‌క‌త‌ను త‌న‌దైన శైలిలో ఇంగ్లీషులో వివ‌రించి ఆక‌ట్టుకుంది. ఆమె మాట్లాడుతున్నంత సేపు స్పీక‌ర్ సీతారాం కూడా చాలా ఆస‌క్తిగా విన్నారు. త‌రువాత ఆ బుజ్జాయిని పిలిచి మ‌రీ అభినందించి వెళ్లారు. ఓ విధంగా ఇవాళ్టి కార్య‌క్ర‌మంలో నాయ‌కు లు కూడా చాలా కూల్-గానే ఉన్నారు. వెనుక‌బ‌డిన జిల్లా అని ఓ సారి క‌లెక్ట‌ర్ ప్ర‌స్తావించినా అదెందుకో స‌బ‌బుగా లేదు. ఎందుకంటే అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప‌నిచేయాల్సిన అధికారులు ఇలాంటి సెంటిమెంట్ ప‌దాల‌ను వాడ‌డం అంత బాలేదు అన్న విమ‌ర్శ కూడా ఉంది. ఇదొక్క‌టీ మిన‌హాయిస్తే అధికారుల స‌మ‌న్వ‌యం కూడా బాగుంది. ఇందుకు రెవెన్యూ మంత్రి ముందునుంచీ తీసుకున్న శ్ర‌ద్ధ కూడా ఫ‌లించింది.

జిల్లాకు వ‌రాలే వరాలు..

శ్రీ‌కాకుళంలో కోడిరామ్మూర్తి స్టేడియం పనులకు ప‌ది కోట్ల రూపాయ‌లు మంజూరు
– ఇంటిగ్రేటెడ్ క‌లెక్ట‌రేట్ 69 కోట్ల రూపాయ‌లు అద‌నంగా మంజూరు
– శ్రీ‌కాకుళం – ఆమ‌దాల‌వ‌ల‌స రోడ్డుకు రూ.40 కోట్లు ఇచ్చాం..
ల్యాండ్ ఎక్విజిషేన్ .. ఇతర ప‌నులు కోసం 18 కోట్లు మంజూరు
– వంశ‌ధార నీరు ఎత్తి పోసేందుకు గొట్టా బ్యారేజ్ వ‌ద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ కు రూ.185 కోట్లు
– టెక్క‌లి ఆఫ్ షోర్ కు 855 కోట్లు మంజూరు
– వంశ‌ధార ఫేజ్ 2 ప‌నులు జ‌రుగుతున్నాయి..
– స‌వ‌రించిన అంచనాల ప్ర‌కారం రూ. 2407 కోట్లు..మంజూరు
– ఈ ఏడాది డిసెంబ‌ర్-కు ప్రాజెక్టు పూర్తి
– ఉద్దానం ప్రాంతంలో వంశ‌ధార నీరు అందించేందుకు రూ.700కోట్ల‌తో ప‌నులు జ‌రుగుతున్నాయి. 70 శాతం ప‌నులు పూర్త‌య్యాయి. ఆ ప్రాజెక్టుకు, ఇచ్ఛాపురం, ప‌లాస, పాత‌ప‌ట్నంలో మూడు మండ‌లాల‌కు రెండు వంద‌ల 50 కోట్ల‌కు పైగా నిధులు.. దాదాపు వెయ్యి కోట్ల రూపాయ‌ల‌తో పైప్ లైన్ ద్వారా వంశ‌ధార అందించేందుకు ప‌నుల‌కు నిధులు మంజూరు చేస్తూ సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...