వైసీపీకి ఆనం వీడ్కోలు..వసంత ఎండ్ కార్డు వేస్తారా?

-

వైసీపీకి సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి వీడ్కోలు చెప్పడానికి రెడీ అయిపోయారు..అతి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి..వైసీపీలో జరుగుతున్న అంశాలని వివరించి ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు ఆయన వైసీపీకి దూరం జరిగారు. పైగా వైసీపీ సైతం ఆనంని దూరం పెడుతూ వచ్చింది. దీంతో ఆనం ఇంకా వైసీపీకి వీడ్కోలు చెప్పేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల ముందే ఆనం టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నా సరే మంత్రి పదవి రాలేదు..అలాగే సీనియర్ గా ప్రాధాన్యత లేదు. పైగా అధికారుల సహకారం లేదు..దీంతో పలు సందర్భాల్లో ఆనం..సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఈ మధ్య ఏం చేశామని ప్రజలని ఓట్లు అడుగుతామని మాట్లాడారు. అలాగే ముందస్తు ఎన్నికలకు వెళితే మనం ముందుగానే ఇంటికెళ్తామని బాంబు పేల్చారు.

 

ఈ వ్యాఖ్యలతో జగన్ సీరియస్ అయ్యి..ఆనంని సైడ్ చేస్తూ వెంకటగిరి ఇంచార్జ్ బాధ్యతలని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. ఆ తర్వాత ఆనం సెక్యూరిటీ తగ్గించారు..తాజాగా గడపగడపకు సేవలందించినందుకు ధన్యవాదాలు అని ప్రభుత్వం నుంచి మెసేజ్ వచ్చింది. అంటే ఇంకా ఆనం గడపగడపకు వెళ్లాల్సిన అవసరం లేదని పరోక్షంగా చెప్పారు. దీంతో ఆనం తన అనుచరులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇంకా వైసీపీలో ఉండలేమని, పార్టీని వీడటం తప్పదని చెబుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఆనం ఇంకా వైసీపీని వీడటం ఫిక్స్.

ఇక ఆనం మాదిరిగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శలు చేయలేదు గాని..నెక్స్ట్ ఈయనకు సీటు గ్యారెంటీ లేదు..దీంతో ఈయన టీడీపీకి టచ్ లో ఉన్నారని సమాచారం. ఈయన కూడా ఎండ్ కార్డు వేసేస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news