ఉత్తరాంధ్ర సరే..కోస్తా-సీమ కలిసొస్తాయా?

-

ఏదో అనుకుంటే ఇంకా ఏదో అయినట్లు కైన్పిస్తోంది..వైసీపీ ఎత్తుకున్న విశాఖ రాజధాని ఉద్యమం. మూడు రాజధానులు అని చెప్పి..మూడు రాజధానులతో లబ్ది పొందాలనేది వైసీపీ కాన్సెప్ట్ అని క్లియర్‌గా అర్ధమవుతుంది. పైకి మూడు ప్రాంతాల కోసమని చెబుతున్నా..మూడు ప్రాంతాల్లో రాజకీయ ప్రయోజనమే వైసీపీ టార్గెట్ అనేది క్లియర్. అయితే మూడు రాజధానులకు ప్రజా మద్ధతు ఉందో లేదో క్లారిటీ లేదు.

ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ సైతం అమరావతి రాజధాని అనే ఎన్నికలకు వెళ్ళి గెలిచింది. మూడు రాజధానులపై ఎన్నికలు జరగలేదు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని వైసీపీ చెప్పింది.. చెప్పి కూడా మూడేళ్లు అవుతుంది..కానీ ఇంతవరకు ఏ రాజధాని లేదు. అమరావతి రైతులు, టీడీపీ, ఇతర పార్టీలు మాత్రం..అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని..రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో ముందుకెళుతున్నాయి.

కానీ వైసీపీ అది పట్టించుకోకుండా మూడు రాజధానులతో మూడు ప్రాంతాల మధ్య రచ్చ లేపేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే తాజాగా విశాఖ పరిపాలన రాజధాని అనే డిమాండ్‌తో అధికారంలో ఉండి కూడా వైసీపీ పోరాటం అంటూ రాజకీయం మొదలుపెట్టింది. విశాఖ గర్జన పేరిట ర్యాలీ చేసింది. దీనికి కోస్తా, సీమకు చెందిన నాయకులు కూడా వచ్చారు. ఇక ఇక్కడ ఒక విషయం ఏంటంటే విశాఖ పరిపాలన రాజధాని అంటే కోస్తా సంగతి ఏమో గాని..సీమకు కాస్త ఇబ్బంది అవుతుంది. సీమ అంటే వైసీపీ కంచుకోట. అంటే సీమ ప్రజలు తాము చెప్పిందే వేదంగా భావిస్తారని వైసీపీ ఈ విధంగా విశాఖ రాజధాని డిమాండ్‌తో ముందుకెళుతుందా? అనేది అర్ధం కాకుండా ఉండి.

ఎందుకంటే శాసనసభ, హైకోర్టులు కంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌నే మెయిన్ క్యాపిటల్‌గా చూస్తారు. అలాంటప్పుడు కోస్తా, సీమల్లో ఇబ్బంది ఎదురయ్యే ఛాన్స్ ఉంది. పైగా విశాఖ అభివృద్ధి చేయకుండా రాజధాని పేరుతో భూ దోపిడిలు చేస్తున్నారని ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్తితుల్లో మూడు రాజధానుల పేరిట వైసీపీ మూడుచోట్ల రిస్క్ పెంచుకునేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news