కేసీఆర్ కాళ్లు మొక్కండి.. ఆ నీళ్లు మీద చల్లుకొండి: చంద్రబాబు

158

ఎవరు ఈ మోహన్ బాబు… ఎవరు ఈ జయసుధ.. ఎవరు ఈ అలీ.. ఎవరు ఈ మనుషులు.. కేసీఆర్ కు ఊడిగం చేస్తే చేసుకోండి. కానీ.. ఇక్కడికి వచ్చి మీ పెత్తనం ఏంటి?

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన వైఎస్సార్సీపీలో చేరిన సినిమా నటులపై ఆయన విమర్శలు చేశారు.

ap cm chandrababu fires on actors who joined in ysrcp

హైదరాబాద్ నుంచి ఇప్పుడు అంతా వలస పక్షులు వచ్చారు. ఇక్కడ ఉండే వాళ్లు ఎవరూ లేరు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ అందరినీ బెదిరించి ఇక్కడికి పంపించారు. కేసీఆర్ ఫోన్ చేస్తే వైఎస్సార్సీపీకి పనిచేస్తున్నవాళ్లు ఉన్నారు. ఆయన ప్రలోభాలకు ఆశ పడి ఏపీకి వచ్చి నన్ను తిడుతున్నారు.

ఎవరు ఈ మోహన్ బాబు… ఎవరు ఈ జయసుధ.. ఎవరు ఈ అలీ.. ఎవరు ఈ మనుషులు.. కేసీఆర్ కు ఊడిగం చేస్తే చేసుకోండి. కానీ.. ఇక్కడికి వచ్చి మీ పెత్తనం ఏంటి? మేము కష్టకాలంలో ఉన్నప్పుడు తిత్లీకొచ్చారా మీరు? హుద్ హుద్ కు వచ్చారా? కేసీఆర్ కాళ్లు మొక్కుతే మొక్కండి. ఆయన కాళ్లు కడిగి నీళ్లు కూడా చల్లుకోండి. కానీ. నా దగ్గర మీ ఆటలు సాగవు.. అని చంద్రబాబు.. వైసీపీలో చేరిన సినీనటులపై నిప్పులు చెరిగారు.