చెత్త‌ను రోడ్ల‌పై పార‌బోసే ఆలోచ‌న‌లు మానుకోండి : చంద్ర‌బాబు

-

  • చీపురుప‌ట్టి రోడ్లు ఊడ్చిన సీఎం

అమరావతి: గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చీపురుప‌ట్టి రోడ్ల‌ను ఊడ్చారు. ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకునే విష‌యంలో అమెరికా, జ‌పాన్ లాంటి దేశాల ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్వచ్ఛతకు చిరునామాగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పరిసరాలతో పాటు మనుషులూ స్వచ్ఛంగా మారాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. విజయవాడలోని అంబేడ్కర్‌ కాలనీ 19వ వార్డులో స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

శిఖామణి సెంటర్‌ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్‌ కాలనీలో రహదారులను చీపురుతో ఊడ్చిన సీఎం.. స్థానికులతో కలిసి సెల్ఫీలు దిగారు. ఇల్లు శుభ్రంగా ఊడ్చి.. ఆ చెత్తను బయట పారబోస్తే సంస్కారం అనిపించుకోదన్నారు. జపాన్‌, సింగపూర్‌ దేశాల్లో ప్రజలెవరూ చెత్తను రోడ్లపై పారబోయరని.. భారతీయులు తమ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకంగా రూ.75 కోట్లు బడ్జెట్లో పెట్టి విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్‌ను ‌ఆదుకున్నామని… ప్రభుత్వ చర్యల వల్ల స్వచ్ఛ్‌ సర్వేక్షన్‌లో ఉత్తమ అవార్డులను విజయవాడ కైవసం చేసుకుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news