7 కోట్ల విషయం లో బుక్ అయిన ఏపీ సర్కార్ ??

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పట్లో మూడు రాజధానిలో విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చిన తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పేరు గట్టిగా వినపడింది. ఈ గ్రూపు సంస్థ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అసెంబ్లీలో ఓ బ్లూ ప్రింట్ లో మూడు రాజధానులు గురించి వివరించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం…కరోనా వైరస్ వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్…ఈ బోస్టన్ కన్సల్టింగ్ కంపెనీకి 7 కోట్ల రూపాయలు ఇవ్వటం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.Image result for ys jaganఇందులో రూ. మూడున్నర కోట్లకు చెక్ కూడా.. ఇచ్చేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోయి రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వాళ్లను ఆదుకోవడానికి డబ్బులు లేవని అబద్ధపు నివేదికలో ఇచ్చిన వాళ్ళకి కోట్లు ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. అసలు బి.సి.జి ని ఎందుకు కన్సల్ట్ చేశారో.. ఎప్పుడు కన్సల్ట్ చేశారో.. ఎవరికీ తెలియదు.

 

అసలు రాష్ట్రానికి సంబంధించిన అతి ప్రాముఖ్యమైన విషయంలో ఇంత వేగంగా నివేదిక రూపొందించిన కంపెనీ మరొకటి ప్రపంచంలో ఉండదు అంటూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పై విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు. ఇలాంటి టైమ్ లో అటువంటి కంపెనీకి వైఎస్ జగన్ సర్కార్ ఏడు కోట్లు ఇవ్వడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తూ ఈ వార్తని, ప్రతిపక్ష పార్టీ టిడిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. దీంతో ఏడు కోట్ల విషయంలో ఏపీ సర్కార్ అడ్డంగా బుక్ అయినట్లు పరిణామం మారింది.

Read more RELATED
Recommended to you

Latest news