కరోనా వైరస్ విస్తరించకుండా ఉండాలి అంటే ప్రపంచం మొత్తం చెప్పే ఒకే ఒక్క మాట జనాలు బయటకు రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు బయటకు వస్తే వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండటం మినహా లాభం లేదు. ఎవరి ఇళ్ళకు వాళ్ళు పరిమితం కావాల్సిన అవసరం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని కనీసం పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి.
ఒక పక్క ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని అన్ని దేశాలు చెప్తున్నా ఏపీ లో మాత్రం రేషన్ సరుకుల కోసం ఉదయం 3 గంటల నుంచి ప్రజలు బారులు తీరుతున్నారు. నూజివీడు, విజయవాడ, ఏలూరు, గుంటూరు, చిత్తూరు, కడప ఇలా ఎక్కడ చూసినా సరే ప్రజలు రేషన్ సరుకుల కోసం ఎగబడే పరిస్థితి వచ్చింది. గోదావరి, రాయలసీమ జిల్లాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
గోదావరి జిల్లాలలో, రాయలసీమ జిల్లాల్లో విదేశాల్లో ఉండే వాళ్ళు ఎక్కువ. పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు క్వారంటైన్ లేకుండా బయట తిరుగుతున్నారు. పోలీసులు కొడితే తిడుతున్నారు. ఇప్పుడు రేషన్ సరుకుల కోసం వాళ్ళు వస్తున్నారు. ఒక్కరికి వ్యాధి ఉన్నా సరే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా బలైపోవడమే.
ఒక పక్కన బయటకు రావొద్దు అని జనాలకు చెప్తున్నా ఏదో కరువు కాలం వచ్చినట్టు ఒక్కసారే మీద పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని నివారించడానికి ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నూజివీడు లో ఒక దుకాణం వద్ద అయితే దాదాపు 200 వందల మంది రేషన్ సరుకుల కోసం బారులు తీరారు. తిండి మీద ఉన్న భయ౦ ప్రాణాల మీద లేకపోవడం ఆందోళన కలిగించే విషయం.