ఆ టీడీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రేం చేస్తున్నారంటే..

-

ఏపీలో టీడీపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత ఆపార్టీ మునుపెన్న‌డూ లేని విధంగా సంక్షోబాన్ని ఎద‌ర్కుంటోంది. అధికారంలో ఉన్న‌ప్ప‌డు ప‌ద‌వులు అ నుభ‌వించిన టీడీపీ ఎమ్మెల్యేలు ప‌లువురు ప్ర‌స్తుతం పార్టీ ఓడిపోయి క‌ష్ట‌కాలంలో ఉంటే.. దానిని ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. ఇప్పుడే వైసీపీ మీద దూకుడుగా వెళితే తమపై ఉన్న పాత కేసులు ఏ మన్నా బయటకుతీస్తారనే భయమో లేక మన పని మనం చేసుకుందాంలే అనే భావనో తెలియదు గానీ టీడీపీ ఎమ్మెల్యేలు కంటికి కనిపించడం లేదు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయి నాలుగు నెలలు దాటింది. అధినేత చంద్రబాబు, మరి కొందరు నేతలు తప్ప మిగతా నాయ‌కులు ఎవరూ పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో లేనట్టు క నిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవ‌ల గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు పని వారు చూసుకుంటున్నారు. నలుగురు, ఐదుగురు తప్ప మిగతా ఎమ్మెల్యేలు ఎవరు వైసీపీ ప్రభుత్వంపై పోరాడటం లేదు. టెక్కలి (శ్రీకాకుళం) ఎమ్మెల్యే గా ఉన్న కింజారపు అచ్చెన్నాయుడు, పాలకొల్లు (పశ్చిమ గోదావరి) ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు, రాజమండ్రి రూరల్ (తూర్పు గోదావరి) ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెద్దాపురం (తూర్పు గోదావరి) ఎమ్మెల్యే చినరాజప్ప, చీరాల (ప్రకాశం) ఎమ్మెల్యే కరణం బలరాం తప్ప మిగతా ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉంటున్నారు.

మిగతా ఎమ్మెల్యేల పరిస్థితిని గమనిస్తే…ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్‌ బెందాళం మొదట్లో కొంచెం యాక్టివ్ గానే కనిపించినా.. తర్వాత సైలెంట్ అయ్యారు. విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కొం చెం జిల్లాలోని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అయితే అసలు అడ్రెస్ లేరు. రేపో మాపో ఆయన పార్టీ మారిపోతారని కూడా ప్రచారం జరుగుతుంది.

అటు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ పూర్తిగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూ రంగా ఉన్నారు. ఇక మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. భ‌వానీ జూనియ‌ర్ కావ‌డంతో ఆమె ఏం మాట్లాడేందుకు ఇష్ట ప‌డ‌డం లేదు. అదేమ‌న్నా అంటే బాబాయ్ అచ్చెన్న ఉన్నాడుగా అని స‌రిపెట్టేసుకుంటున్నార‌ట‌.

ఇటు వెస్ట్ గోదావరి టీడీపీలో రామానాయుడు ఫుల్ యాక్టివ్ గా ఉండగా, ఉండి ఎమ్మెల్యే కలవపూడి రాంబాబు అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. కృష్ణాలో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గాల్లో పనులు చేసుకుంటున్నారు. అయితే కీల‌క జిల్లా నుంచి పార్టీ త‌ర‌పున వీళ్లు ఇద్దరే గెలిచినా ఇద్దరు అధికార పార్టీ త‌ప్పు ఒప్పులు మాత్రం ఎత్తి చూప‌డం లేదు.

గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి కొంచెం పార్టీ కార్యక్రమాల్లో కనబడుతున్నారు గానీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అయితే అడ్రెస్ లేరు. ప్రకాశంలో టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే స్వామి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కూడా నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఏలూరు సాంబశివ‌రావు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్యటిస్తూ స్థానికంగా త‌న ప‌ట్టు త‌గ్గకుండా చూ సుకుంటున్నారు. ఇక అనంతపురం జిల్లాలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలోనే ఉన్నారు.

హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి తెలిసిందే. ఆయ‌న గెలిచిన‌ప్పుడే నియోజ‌క‌వ‌ర్గానికి చాలా దూరం… ఇప్పుడు పార్టీ ప్రతిప‌క్షంలో ఉండ‌డంతో పూర్తిగా సినిమా షూటింగ్‌ల్లోనే ఉంటున్నారు. టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు పార్టీని భుజాల మీద మోస్తూ వెళుతున్నారు. మొత్తం మీద 23 మంది ఎమ్మెల్యేల్లో చాలామంది ఎక్కడి వారు అక్కడే గప్ చుప్ అనే విధంగా ఉండిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news