బాబు బైట్ : ఏంటి నారాయ‌ణ కిడ్నాప్ అయ్యారా ?

-

ముంద‌స్తు నోటీసులు లేవు.. క‌నీసం అరెస్టులో పాటించాల్సిన నియమాలేవీ పాటించ‌లేదు అని తెలుగుదేశం గగ్గోలు పెడుతూ నారాయ‌ణ ఎపిసోడ్ ను మ‌రింత‌గా వివాదాస్ప‌దం చేస్తుంద‌న్న విమ‌ర్శ ఒక‌టి వైసీపీ నుంచి వ‌స్తోంది. దీంతో నారాయ‌ణు కిడ్నాప్ చేసి తీసుకుని వ‌చ్చార‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నిన్న‌టి వేళ ఓ ఆరోప‌ణ చేశారు. ఇదే ఇప్పుడు మ‌రో పొలిటిక‌ల్ ఇంటెన్ష‌న్ ఓరియెంటెడ్ డిస్క‌ష‌న్ కు దారి తీస్తోంది. ఇదే సంద‌ర్భంలో సీఎం జ‌గ‌న్ పై చంద్ర‌బాబు మాట‌ల దాడి చేశారు. కుప్పం వేదిక‌గా త‌న మాటల్లో ధాటిని పెంచి దాడి చేశారు. టీడీపీ చేసిన వెర్బ‌ల్ ఎటాక్ కార‌ణంగా ఇప్పుడు వైసీపీ మ‌ళ్లీ త‌న గొంతుక వినిపించ‌నుంది ఇదే విష‌య‌మై !

 

జ‌గ‌న్-కు మాన‌వ‌త్వం లేదు : బాబు ఆరోప‌ణ

జ‌గ‌న్-కు మాన‌వ‌త్వం లేనే లేద‌ని అంటున్నారు మ‌రియు ఆరోపిస్తున్నారు చంద్ర‌బాబు. ఇదే స‌మ‌యంలో గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం అనుస‌రించిన వైఖ‌రిపై కూడా వైపీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది. ఇవి ఎలా ఉన్నా కూడా కొద్ది రోజుల పాటు ఈ వాగ్యుద్ధం మాత్రం కొన‌సాగ‌నుంది. నారాయ‌ణ కేసులో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరుపై చంద్ర‌బాబు మండిప‌డుతున్నారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న మాజీ మంత్రిని అరెస్టు చేసిన విధానం అస్స‌లు నిబంధన‌ల‌కు అనుగుణంగా లేద‌ని అచ్చెన్న సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.

నారాయ‌ణ పై ప్ర‌స్తుత ప్ర‌భుత్వ చ‌ర్య దుర్మార్గం అని అంటున్నారు చంద్ర‌బాబు. ఇదే స‌మ‌యంలో ఈ వ్యాఖ్య‌ల‌ను వైసీపీ తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకిస్తూ, త‌న‌దైన వాద‌న చెప్పింది. ప్ర‌భుత్వ పెద్ద సజ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి మాట్లాడుతూ నారాయ‌ణ అరెస్టు అన్న‌ది చ‌ట్ట విరుద్ధం అన్న విధంగా ఆ అర్థం వ‌చ్చే విధంగా మాట్లాడ‌డం త‌గ‌ద‌ని హిత‌వు చెప్పారు. మ‌రోవైపు నారాయ‌ణ ఫోన్ ట్యాపింగ్ చేశాకే ఆధారాలు దొరికాకే తాము అరెస్టు చేశామ‌ని మ‌రో సీమ పెద్ద పెద్దిరెడ్డి (విద్యుత్ శాఖ మంత్రి) ధ్రువీక‌రించారు.

ఇదే విష‌య‌మై చంద్ర‌బాబు నాయుడు నిన్న‌టి వేళ అమిత్ షాకు ఫోన్ చేశారు. మ‌రి! అక్క‌డి నుంచి ఎటువంటి ఆన్స‌ర్ వ‌చ్చింద‌న్న విష‌య‌మై ఇంకా ఎటువంటి స్ప‌ష్ట‌త కానీ క‌నీస స్థాయి స‌మాచారం కానీ లేదు. ఇదే స‌మ‌యంలో నారాయ‌ణ అరెస్టు కానీ గ‌తంలో కార్పొరేట్ సంస్థ‌లు చేసిన మార్కెట్ మాయాజాలంపైనే వివాదాలు రేగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news