మోడీ కన్నెర్ర చేస్తే కేసీఆర్ జైలుకే…!

దుబ్బాకలో ఇప్పుడు బిజెపి, వర్సెస్ తెరాస గా రాజకీయం మారిపోయింది. బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావుని టార్గెట్ చేసారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనిపై బిజెపి నేతలు మండిపడుతున్నారు. తాజాగా బిజెపి నేత బాబు మోహన్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. కరీంనగర్ లో బండి సంజయ్ దీక్ష చేసే ప్రాంతానికి ఆయన వెళ్ళారు. దుబ్బాకలో కనీస వసతులు లేవు అని ఆరోపించారు.

గజ్వేల్, సిద్దిపేట ఎలా ఉన్నాయి.. దుబ్బాక ఎలా ఉంది అని ప్రశ్నించారు. రఘునందన్ మీద కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు విమర్శలు చేసారు. మామా అల్లుళ్ళ కుట్రలు పని చేయవు అని ఆయన స్పష్టం చేసారు. ప్రధాని కన్నెర్ర చేస్తే కేసీఆర్ జైల్లో ఉంటారు అని బాబు మోహన్ అన్నారు.