వైసీపీకి ఛాన్స్ ఇచ్చిన బాబు..టీడీపీ బ్రతకదు..!

-

రాజకీయాల్లో నేతలు ఆచి తూచి మాట్లాడాలి..కొంచెం అటు ఇటైన ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు చివరి ఎన్నికలు అని మాట్లాడటమే పెద్ద తప్పు అయినట్లు కనిపిస్తోంది. గతంలో జగన్ ఒక్క ఛాన్స్ అని అడగడంలో అర్ధం ఉంది..కానీ ఇప్పుడు బాబు ఏమో నెక్స్ట్ ఎన్నికలే నాకు చివరి ఎన్నికలు, ప్రజలే గెలిపించుకోవాలని చెప్పారు. అంటే బాబు కాన్సెప్ట్ ప్రకారం..ఆ తర్వాత నుంచి రాజకీయాల్లో కనబడరని అర్ధమవుతుంది.

తనకు వయసు మీద పడిందని, వైసీపీతో పోరాటం చేయడంలో వెనుకబడుతున్నానని భావించి..చివరికి సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. ఇంకా చివరి ఎన్నికలు అని మాట్లాడుతున్నారు. ఇలా చివరి ఎన్నికలు అని మాట్లాడటం వల్ల టీడీపీ భవిష్యత్ ప్రమాదంలో పడేలా ఉంది. ఇదే అంశం ఇప్పుడు వైసీపీకి ఆయుధంగా మారాయి. నెక్స్ట్ ఎన్నికలు చంద్రబాబుకే కాదు..టీడీపీకి కూడా చివరి ఎన్నికలు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.

చంద్రబాబే టీడీపీక్ రాజకీయ సమాధి కడుతున్నారని, తులసి తీర్ధం పోస్తే తప్ప ఇంకా బతకను అన్నట్లుగా చంద్రబాబు కన్నీరు కారుస్తున్నారని, బాబు ఏడుపులు, గగ్గోలు చూసి జనం నవ్వుకుంటున్నారని, లోకేష్‌పై బాబుకు ఆశలు లేవని, మానసిక ఒత్తిడికి లోనయ్యి, ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్ చేస్తున్నారు.

ఇప్పుడు బాబు చివరి ఎన్నకలు అని చెప్పడంతో..నెక్స్ట్ నడిపించేది లోకేష్ అని అందరికీ అర్ధమవుతుంది. ఇక లోకేష్ వల్ల పార్టీకి ప్రయోజనం ఉండదని, అందుకే బాబు సైడ్ అవ్వగానే, టీడీపీ కూడా కనుమరుగు అవుతుందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. పైగా జగన్‌ని ఎదుర్కొలేక ఇలా సెంటిమెంట్ అస్త్రం వదులుతున్నారని జనాలకు అర్ధమైతే ఇబ్బంది. టీడీపీ భవిష్యత్ కూడా ప్రమాదంలో పడుతుంది. మొత్తానికి బాబు చివరి ఎన్నికల కాన్సెప్ట్ వైసీపీకి ఆయుధం అయింది. మరి ఈ కాన్సెప్ట్‌ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news