గంటా శ్రీనివాసరావు మరొక బ్యాడ్ నిర్ణయం ? 

-

పవర్ లేకపోవటంతో గంటా శ్రీనివాసరావు వేస్తున్న ప్లాన్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో జగన్ సొంత ఇలాకా లోనే ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జండా గెలిచే విధంగా గంటా శ్రీనివాస్ వెనక ఉండి అద్భుతమైన వ్యూహాలు వేసి తిరుగులేని చాణిక్యుడు అని అనిపించుకున్నాడు. ఆ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యవహారాలను గంటా శ్రీనివాస్ దగ్గరుండి చూసుకునేవారు. అటువంటి గంటా శ్రీనివాస్ ప్రస్తుతం ఇటీవల కేవలం రాష్ట్రానికి మరియు జిల్లా కి కాకుండా కేవలం నియోజకవర్గానికి పరిమితమయ్యారు. Image result for ganta srinivasవిశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో ఉన్న సీట్లు మొత్తం తెలుగుదేశం పార్టీ కాతాలో పడేలా పక్కా ప్లాన్ తో రెడీ అయ్యారు. ఇటువంటి తరుణంలో అమరావతి నే రాజధానిగా చేయాలన్న బిజెపి- జనసేన పార్టీలతో చేతులు కలిపి లోపాయికారి ఒప్పందంతో మొత్తం వార్డు కార్పొరేటర్ లను గెలిపించుకోవాలని గంటా శ్రీనివాస్ నిర్ణయం తీసుకోవటం జరిగింది.

 

ఇటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం లో ఉన్న ప్రజలు విశాఖను రాజధానిగా కాదన్నా ఆ పార్టీలతో గంటా చేతులు కలపడంతో తీవ్రంగా విభేదిస్తున్నారట. చాలామంది కార్పొరేటర్లు వైజాగ్ ని రాజధానిగా గుర్తించిన వైసీపీ వైపు చూస్తున్నారట. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో చక్రం తిప్పాలని గంట తీసుకున్న నిర్ణయం బ్యాడ్ నిర్ణయమైంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Read more RELATED
Recommended to you

Latest news