నై జ‌గ‌న్ : కేటీఆర్ మాట‌ను నిజం చేసిన మామ !

-

జ‌గ‌న్ మామ బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి
ఆయ‌న గ‌తంలో విద్యుత్ శాఖ మంత్రిగా ప‌నిచేశారు
ఇప్పుడు ఆయ‌న జిల్లా(ప్ర‌కాశం జిల్లా)లోనే ప‌వ‌ర్ ఆఫ్ న‌డుస్తోంది
మ‌రో 15 రోజుల పాటు ఇదే విధంగా ఉండ‌నుంది
ఈ నేప‌థ్యంలో క‌థ‌నం

అభివృద్ధి క‌న్నా ఆవేశపూరిత మాటల్లో, ఆగ్ర‌హంతో ఊగిపోయే ప‌ద్ధ‌తిలో వైసీపీ మంత్రులూ, ఎమ్మెల్యేలూ, ఎంపీలూ ముందుంటారు. ఆ విధంగా వాళ్లేం మాట్లాడినా చెల్లుతుంద‌న్న భావ‌న‌ను ఎన్నో సార్లు నిరూపించాల‌న్న ప్ర‌య‌త్నం కూడా చేసి విఫ‌లత పొందారు. ఎన్నో సార్లు సీన్ రివ‌ర్స్ అయింది. ఫ‌లితం తేడా కొట్టింది. ఇంత జ‌రిగినా కూడా వైసీపీలో పెద్ద‌గా మార్పులు అయితే రావు. ఇత‌రుల‌ను అర్థం చేసుకుని, వాటి మాట‌ల‌కు కౌంట‌ర్లు ఇచ్చేట‌ప్పుడు ఒక‌టికి ప‌దిసార్లు వాస్త‌వాలను అంచ‌నా వేసుకుని మాట్లాడ‌డం అన్న‌ది ఇప్ప‌ట్లో నెర‌వేరే ప‌ని క‌దా!

అందుకే చాలా సార్లు వైసీపీ స‌ర్కారు పెద్ద‌లంతా క‌లిసి త‌మ వాళ్ల‌నే వారించిన దాఖ‌లాలూ, త‌ప్పు ఉంటే దిద్దుకోమ‌ని చెప్పిన వైనాలూ, సంద‌ర్భాలూ ఉన్నాయి. అయినా కూడా కొన్ని సార్లు ఎవ‌రేం అనుకున్నా ప‌ర్లేదు అని బ‌స్తీ మే స‌వాల్ అని చెబుతారు. ఆ విధంగా పొరుగు మంత్రి ఓ మాట అంటే వెంట‌నే ట్రోల్ చేశారు ఆయ‌న్ను. మంత్రి రోజా మాత్రం ఆ కుటుంబంతో ఉన్న సత్సంబంధాల రీత్యా వెన‌క్కు త‌గ్గారు కానీ, మిగిలిన వాళ్లంతా త‌మ‌తో రావాల‌ని అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామ‌ని, త‌మ ప్రాంతం అభివృద్ధి కి ఓ న‌మూనా అని ఏవేవో అన్నారు. చెప్పారు. వెల్ల‌డించారు.

ఆఖ‌రికి ఏమ‌యింది ఏపీలో మ‌రో ప‌దిహేను రోజుల పాటు ప‌వ‌ర్ ఆఫ్ లు ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి వ‌ర్తితం కానున్నాయి. అమ‌లు కానున్నాయి. కానీ కేటీఆర్ ఏ ఉద్దేశంతో అన్నారు. ఆయ‌న సెల్ఫ్ ప్ర‌మోష‌న్ ను ఆ మాట ఏ మేరకు ఉప‌యోగ‌ప‌డింది.. అన్న‌ది మాత్రం అస్స‌లు ఎవ్వ‌రూ గుర్తించ‌లేక‌పోయారు. వాస్త‌వాల‌ను సరిదిద్ద‌కుండానే ఆవేశంతో మాట్లాడి ప‌రువు పోగొట్టుకుంటున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాస్త వెన‌క్కు త‌గ్గి మాట్లాడితే పోయేదేం ఉంది. క‌నుక వైసీపీ నాయ‌కులు త‌గ్గి ఉంటే త‌ప్పులున్నా ప్ర‌జ‌లు ఒప్పుకుంటారు. త‌ప్పులున్నా స‌రే మాట‌ల దాడిని సైతం షురూ చేస్తూ పోతే గోపాల‌పురం ఎమ్మెల్యేకు ఇచ్చిన ట్రీట్మెంట్ మీకూ ఇస్తారు.

ఆంధ్రావ‌నిలో నీళ్లు, క‌రెంటు, రోడ్లు లేవ‌ని త‌న‌తో ఓ స్నేహితుడు చెప్పాడ‌ని కేటీఆర్ ఇటీవ‌ల ఓ వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య ప‌ర్యావ‌సానంగా బొత్స కూడా కౌంట‌ర్లు దాఖ‌లు చేశారు. తాను ఇటీవ‌లే హైద్రాబాద్ నుంచి ఇక్క‌డికి వ‌చ్చాన‌ని, అక్క‌డ క‌రెంట్ లేక జ‌న‌రేటర్ వేసుకుని ఉన్నాన‌ని అన్నారు. దీనిపై వెంట‌నే తెలంగాణ విద్యుత్ బ‌దులు ఇచ్చింది. మీరు బిల్లు క‌ట్ట‌లేద‌ని, వెంట‌నే బిల్లు క‌డితే విద్యుత్ స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రిస్తామ‌ని చెప్పింది. దీనిపై కూడా బొత్స క్లారిటీ ఇచ్చారు. తాను విద్యుత్ బిల్లు క‌ట్టాన‌ని అందులో ఎటువంటి సందేహానికీ తావేలేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ విధంగా సాగిన ఈ ఎపిసోడ్లో ఒక్కొక్క‌రూ వ‌చ్చి ఒక్కో శైలిలో మాట్లాడారు. త‌మ ఊరికి నాలుగు కాదు నాలుగు వంద‌ల బ‌స్సులు వేసుకుని రావాల‌ని ఇక్క‌డ ఏం జ‌రిగిందో తాము చూపిస్తామ‌ని సీదిరి లాంటి ఆవేశంతో ఊగిపోయే అమాత్యులు స్పందించారు. ఇవ‌న్నీ మీడియా ట్రోల్ అయ్యాయి కానీ ప‌వ‌ర్ క‌ట్స్ అలానే ఉన్నాయి. ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ ఆఫ్ అలానే ఉంది. రోడ్లు బాలేక ప్ర‌యాణికుల అవ‌స్థ‌లు అలానే ఉన్నాయి. ఆఖరికి మాజీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని సొంత జిల్లా ప్ర‌కాశంలోనూ ప‌వ‌ర్ క‌ట్స్ త‌ప్ప‌డం లేదు. పరిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ ఆఫ్ ప్ర‌క‌టించారు క‌దా! దానిని మ‌రో 15 రోజుల‌కు పొడిగించి త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చేవ‌ర‌కూ ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగించాల‌ని సంబంధిత ఉన్న‌తాధికారులు ఆదేశించారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా కూడా తాము చెప్పిందే వేదం అంటూ చెబితే ఏం చేయలేం.

Read more RELATED
Recommended to you

Latest news