నాపై దాడి చేయించింది కేసీఆర్, కేటీఆర్ లే అని కేఏ పాల్ ఆరోపించారు. నాపై దాడి చేసిన వ్యక్తి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇచ్చిన వ్యక్తి అని కేఏ పాల్ ఆరోపించారు. నాపై దాడి చేస్తున్న సమయంలో దాడిచేసిన వ్యక్తితో పోలీస్ ఆఫీసర్ ఫోన్ లో బ్లూటూత్ లో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పోలీసులు కేసీఆర్, కేటీఆర్ గుండాలా… గవర్నర్ పోలీసులా..? అని ప్రశ్నించారు. నాపై జరిగిన దాడిని అన్ని పార్టీలు ఖండించాలని కోరారు. నేను చేసిన తప్పేంటని ప్రశ్నించారు…. ప్రత్యేక తెలంగాణ కోసం నేను పోరాడటం తప్పా అంటూ కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 155 దేశాల్లో నాకు 10 లక్షల ఎకరాల్లో ఛారిటీలు నిర్వహిస్తున్నానని… ఆయన అన్నారు. డీజీపీకి నా ఫోన్ కు రెస్పాన్స్ కావడం లేదని కేఏ పాల్ అన్నారు. డీజీపీ దగ్గరకు వెళ్లకుండా నన్ను హౌజ్ అరెస్ట్ చేశారని…నన్ను ఎంత కాలం నిర్భందిస్తారు… నేను రైతుల వద్దకు వెళ్లడం తప్పా..? అని ప్రశ్నించారు. మీరు ప్రధాన మంత్రి కావాలని రాకేష్ టికాయత్ వంటి రైతు నేతలు నన్ను అడిగారని కేఏ పాల్ అన్నారు. తెలంగాణలో వేల కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్ఎస్ పార్టీకి 28 స్థానాల కన్నా ఎక్కువ రావని పీకే గారు చెప్పారని కేఏ పాల్ వెల్లడించారు.
నాపై దాడి చేయించింది కేసీఆర్, కేటీఆర్ లే : కేఏ పాల్
-