అప్పుడు బీజేపీ.. ఇప్పుడు టీఆర్ఎస్‌.. భాగ్య‌ల‌క్ష్మీ ఆల‌యం మీదే!

-

తెలంగాణ‌లో ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నిక‌ల వేఢి రాజుకుంటోంది. రోజురోజుకూ స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌తో పార్టీలు హీటెక్కుతున్నాయి. అయితే రీసెంట్‌గా ఈటల రాజేంద‌ర్ సీఎం కేసీఆర్‌కు రాసిన‌ట్టు ఓ లేఖ సంచ‌ల‌నం రేపుతోంది. అందులో సీఎం కేసీఆర్‌ను క్ష‌మించ‌మ‌ని కోరిన‌ట్టు ఉంది. అయితే దీనిపై ఇటు బీజేపీ, అటు టీఆర్ఎస్ స‌వాళ్లు విసురుకుంటున్నాయి.

బాల్క సుమ‌న్ కావాల‌నే ఆ లేఖ‌ను సృష్టించార‌ని బండి సంజ‌య్ వ్యాఖ్యానిస్తే.. అటు బాల్క సుమ‌న్ స్పందిస్తూ ఆ లెట‌ర్ ఫేక్ దే అని బండి సంజయ్ చార్మినార్ వ‌ద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆల‌యంలో ప్రమాణం చేసి చెప్పాల‌ని స‌వాల్ వేశారు. అయితే ఆయ‌న భాగ్య‌ల‌క్ష్మీ ఆల‌యం వ‌ద్దే ఎందుకు ప్ర‌మాణం చేయ‌మ‌న్నారంటే.. గ‌తంలో జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల‌ప్పుడు కూడా ఓ లేఖ‌పై ఇదే రాజ‌కీయం జ‌రిగింది.

అప్పుడు వ‌ర‌ద బాధితుల‌కు ప్ర‌భుత్వం ఇస్తున్న 10వేల సాయాన్ని ఆపేయాలంటూ బండిసంజ‌య్ పేరుమీద ఈసీకి లేఖ రాసిన‌ట్టు సంచ‌ల‌నం రేపింది. అయితే ఆ లేఖ త‌న‌పేరుపై కావాల‌నే టీఆర్ఎస్ నేత‌లు సృష్టించార‌ని, నిజ‌మైతే కేసీఆర్ భాగ్య‌ల‌క్ష్మీ ఆల‌యం వ‌ద్ద‌కు వ‌చ్చి ప్ర‌మాణం చేయాలంటూ బండి సంజ‌య్ స‌వాల్ విసిరారు. అంతే కాదు ఆయ‌న ఏకంగా ఆల‌యం వ‌ద్ద‌కు వెళ్లి కేసీఆర్‌కు నిజంగా ధైర్యం ఉంటే రావాల‌ని డిమాండ్ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఇది టీఆర్ ఎస్‌ను పెద్ద దెబ్బ కొట్టింది. అందుకే ఇప్పుడు బీజేపీకి చెక్ పెట్టాల‌ని అదే ఆల‌యం మీద ప్ర‌మాణం చేయాల‌ని బాల్క సుమ‌న్ డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మ‌రి బండి సంజ‌య్ ఏమైనా స్పందిస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news