ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ పార్టీపై తనపై చేసిన విమర్శలకు ధీటుగా బదులిచ్చారు బండి సంజయ్. తాగి బండి నడిపితేనే తప్పుగా భావిస్తాం కేసులు పెడతాం.. అలాంటిది తాగి రాష్ట్రాన్ని నడిపితే తప్పు కాదా.. అని సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సచివాలయం కూలగొట్టి, సచివాలయానికి రాని ముఖ్యమంత్రని విమర్శించారు. డిల్లీలో అగ్గి పెడతాం అనడం కాదు.. పక్క రాష్ట్రం ప్రాజెక్ట్ లు కడుతుంది ముందు అది తేల్చు అని ఎద్దేవా చేశారు.
కేఆర్ఎంబీపై అనుమానాలు ఉంటే మీటింగులకు ఎందుకు హాజరయ్యావని ప్రశ్నించారు. క్రిష్ణా నది జలాల నుంచి తెలంగాణ వాటా కింద 575 టీఎంసీలు రావాల్సి ఉన్నా.. 298 టీఎంసీలకే ఎందుకు సంతకం పెట్టింది నిజం కాదా..అని ప్రశ్నించారు. తెలంగాణకు మొదటి ద్రోహి కేసీఆరే అని ఘాటుగా విమర్శలు చేశారు.